తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన మార్కెట్ కమిటీ ఛైర్మన్

KMM: నేలకొండపల్లి మండలంలో అర్ధరాత్రి కురిసిన వర్షం కారణంగా మార్కెట్‌లో తడిసిన ధాన్యాన్ని శుక్రవారం మార్కెట్ కమిటీ ఛైర్మన్ సీతారాములు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో ఆయన మాట్లాడి ఎవరు అధైర్యం పడవద్దని తెలిపారు. రైస్ మిల్లులలో ఖాళీ లేకపోవడంతో కొనుగోలులో జాప్యం జరిగిందని, మంత్రితో మాట్లాడి ప్రతి గింజ కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు.