పోలీసుల సమక్షంలో రైతులకు యూరియా పంపిణీ

WNP: అమరచింత మున్సిపాలిటీ కేంద్రానికి గత రాత్రి యూరియా లోడ్ వచ్చింది. పట్టణంలోని ఆగ్రో రైతు సేవ కేంద్రం వద్ద శనివారం ఉదయం రైతులు పెద్ద ఎత్తున యూరియా కోసం వచ్చారు. దీంతో రైతులు ఇబ్బందులు పడకుండా పోలీసులు తమ సమక్షంలో యూరియా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. యూరియా అందరికీ దొరుకుతుందని ఎవరు ఇబ్బంది పడొద్దు అని పోలీసులు రైతులకు సూచించారు.