నగరంలో కమిషనర్ ఆకస్మిక తనిఖీలు
కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.వి సత్యనారాయణ మంగళవారం నగరంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. సర్కిల్ 5, 7, 11, 12 పరిధిలోని పలు వార్డుల్లో పర్యటించారు. సంపూర్ణ పారిశుధ్యం అమలయ్యే తీరు పరిశీలించారు. నగరపాలక సంస్థ అధికారులకు ప్రజలు సహకరించాలని కోరారు. చెత్త సేకరణ విధానాన్ని స్థానిక మహిళలు, ప్రజల నుంచి అడిగి తెలుసుకున్నారు.