బాలాజీ రైల్వే డివిజన్ కోసం వినతి

బాలాజీ రైల్వే డివిజన్ కోసం వినతి

తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని సాధన సమితి నాయకులు కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్‌ను న్యూఢిల్లీలో కలిశారు. మంత్రి రామ్మోహన్ నాయుడు, లావు కృష్ణదేవరాయలు, ఎంపీ దుర్గాప్రసాద్ కలిసి సమితి వినతిపత్రం సమర్పించారు. రాయలసీమ అభివృద్ధికి డివిజన్ అవసరమని తెలిపారు. రేణిగుంట, తిరుచానూరు స్టేషన్లను అభివృద్ధి చేయాలని కోరారు.