'తాగునీటిని వృధా చేయకుండా వాడుకోవాలి'

'తాగునీటిని వృధా చేయకుండా వాడుకోవాలి'

VZM: బొబ్బిలి MPDO పి.రవికుమార్ ఇవాళ స్దానిక కృష్ణాపురంలో తాగునీరు సరఫరా, చెత్త సీకరణను పరిశీలించారు. ఈ సందర్భంగా తాగునీటిని వృధా చేయకుండా వాడుకోవాలని ప్రజలను కోరారు. క్లోరినేషన్‌ చేసిన తర్వాత తాగునీరు సరఫరా చేయాలని, లీకులు లేకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించి సంపద కేంద్రానికి తరలించాలని గ్రీన్‌ అంబాసిడర్లకు ఆదేశించారు.