ఏఎస్ఐ రాములుకు ఘనంగా వీడ్కోలు
SRPT: నేరేడుచర్ల పోలీస్ స్టేషన్‌లో ఏఎస్ఐగా పనిచేసి పదవీ విరమణ పొందిన రాములును ఎస్పీ కె.నరసింహ ఘనంగా సన్మానించారు. పోలీసు శాఖలో సుదీర్ఘ సేవలు అందించడం అభినందనీయమని ఎస్పీ కొనియాడారు. విధి నిర్వహణలో భార్య సహకారం ఎంతో విలువైనదని, పదవీ విరమణ అనంతరం కుటుంబంతో సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తోటి సిబ్బంది, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.