VIDEO: హోటల్‌లో భోజనం.. ఆరుగురికి తీవ్ర అస్వస్థత.!
MNCL: బెల్లంపల్లి పట్టణంలోని కాల్టెక్స్ ప్రాంతంలో గల ఒక రెస్టారెంట్‌లో భోజనం చేసిన ఆరుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బర్త్ డే పార్టీ అని రాత్రి భోజనం చేసిన ఎనిమిది మందిలో ఆరుగురికి వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి రావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.