VIDEO: జాతీయ లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలి

EG: మార్చి 8న జరిగే జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని అనపర్తి జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి వంశీ కృష్ణ సూచించారు. అనపర్తిలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.. కోర్ట్ పరిధిలో ఉన్న సివిల్, రాజీ చేయదగ్గ క్రిమినల్ కేసులను పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.