ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలి: ఎమ్మెల్యే

ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలి: ఎమ్మెల్యే

NLG: దేవరకొండలోని భవిత విద్యా కేంద్రంలో ఎమ్మెల్యే బాలునాయక్ బుధవారం అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డీవో రమణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.