ఒంటిమిట్ట శ్రీరాముని దర్శనం కోసం ప్రత్యేక బస్సు

ఒంటిమిట్ట శ్రీరాముని దర్శనం కోసం ప్రత్యేక బస్సు

కోనసీమ: రావులపాలెం ఆర్టీసీ డిపో నుంచి ఒంటిమిట్ట శ్రీరాముని దర్శనం కోసం ఏప్రిల్ 11న సూపర్ లగ్జరీ బస్సు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ కుమార్ వెల్లడించారు. ఈ యాత్రలో ఒంటిమిట్ట శ్రీరామాలయం, తాళ్లపాక అన్నమాచార్యుల జన్మస్థలం, దేవుని గడప, నందలూరు శివాలయం, పుష్పగిరి ఏడు నదుల సంగమం దర్శనాలు ఉంటాయన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.