VIDEO: హుస్నాబాద్ టోల్ ప్లాజా వద్ద ఉద్రిక్తత
SDPT: హుస్నాబాద్ జాతీయ రహదారిపై ఉన్న టోల్ ప్లాజా వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. టోల్ ప్లాజాకు జమ్నిదోర్నాల పేరు పెట్టడంపై హుస్నాబాద్ గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఖరారైన పేరును పెట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో టోల్ ప్లాజా వద్ద ఇరు గ్రామాల ప్రజలు భారీగా చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని గొడవను సద్దుమణిగేలా చేశారు.