VIDEO: మేఘాలను చీల్చుకుంటూ వెళ్తున్న మిసైల్స్
ఇరాన్ గగనతలంలో బాలిస్టిక్ క్షిపణులు దూసుకెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ కమర్షియల్ విమానం కిటికీ నుంచి తీసిన ఈ వీడియోలో క్షిపణులు మేఘాలను చీల్చుకుంటూ నింగిలోకి వెళ్లడం స్పష్టంగా కనిపిస్తోంది. యుద్ధ వాతావరణం కొనసాగుతోన్న నేపథ్యంలో ఈ భీకర దృశ్యాలు నెటిజన్లను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. విమాన ప్రయాణికులు ఈ దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా షాక్ తిన్నారు.