పోలీసులకు వీక్లీ పరేడ్.. మాబ్ ఆపరేషన్ ప్రాక్టీస్
NRPT: పరేడ్ చేయడం ద్వారా శరీరం దృఢంగా మారుతుందని సీఐ సైదులు అన్నారు. శనివారం నారాయణపేట ఎస్పీ పరేడ్ మైదానంలో పోలీసులకు వీక్లీ పరేడ్ నిర్వహించారు. అనంతరం మాబ్ ఆపరేషన్ ప్రాక్టీస్ చేయించారు. అసాంఘిక ఘటనలు సాంఘిక శక్తులు దాడులకు పాల్పడినప్పుడు ఎలా పోరాడాలి అనే విషయాలను వివరించారు. అల్లర్లు, ఆందోళనలను ఎలా నియంత్రించాలని అనే విషయాలపై అవగాహన కల్పించారు.