ఇరాన్‌పై దాడి.. స్పందించిన అధ్యక్షుడు
ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ చేస్తున్న దాడిపై ఆ దేశ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ స్పందించారు. శత్రు స్థావరాలను భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. అయతుల్లా అలీ ఖమేనీ చూపించిన మార్గంలో నడుస్తామని పేర్కొన్నారు. తమ సాయుధ బలగాలు దాడులు కొనసాగిస్తాయని వెల్లడించారు. కాగా, అమెరికా యుద్ధనౌక 'లింకన్'పై నాలుగు బాలిస్టిక్ మిసైళ్లతో దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది.