'ప్రైవేట్ అన్ ఎయిడ్ పాఠశాలల్లో ఉచిత విద్యా ప్రవేశాలు'
విజయనగరం: జిల్లాలోని ప్రైవేట్ అన్-ఎయిడెడ్ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలకు సంబంధించి 2026-27 విద్యా సంవత్సరానికి గాను మొదటి విడత లక్కీ డ్రా (లాటరీ) ఫలితాలను జిల్లా విద్యాశాఖాధికారి యు. మాణిక్యం నాయుడు విడుదల చేశారు. మొదటి విడత లాటరీ ద్వారా 1503 మంది విద్యార్థులు ఎంపికయ్యారన్నారు. మార్చి 26 నుండి ఏప్రిల్ 7వ తేదీ లోపు విద్యార్థులు తమ ప్రవేశాలను నిర్దారించుకోవాలన్నారు.