'బస్టాండ్లలను శుభ్రంగా ఉంచండి'

అన్నమయ్య: నిమ్మనపల్లి బస్టాండులో చేపట్టిన చెత్త సేకరణ కార్యక్రమాన్ని ఎంపీడీవో రమేష్ బాబు, డిప్యూటీ ఎంపీడీవో బాలరాజులు తనిఖీ చేశారు. నిత్యం విద్యార్థులు ప్రయాణికులు ప్రయాణిస్తుంటారని, బస్టాండ్‌ను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. దుకాణదారులు ఎక్కడపడితే అక్కడ వ్యర్ధపదార్థాలను వేసి బస్టాండ్‌ను అపరిశుభ్రం చేయొద్దన్నారు. బస్టాండును పరిశుభ్రంగా ఉంచుకోవడం మన బాధ్యత అన్నారు.