ఈనెల 27న మద్యం దుకాణాలకు డ్రా

ఈనెల 27న మద్యం దుకాణాలకు డ్రా

NLG: జిల్లాలోని 154 మద్యం దుకాణాలకు 4906 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి రమణ శనివారం తెలిపారు. ఈనెల 27న ఉదయం 11గంటలకు నల్గొండలోని HYD రోడ్‌లో గల లక్ష్మీ గార్డెన్‌లో కలెక్టర్ ఆధ్వర్యంలో మద్యం దుకాణాల ఎంపిక డ్రా ద్వారా జరుగుతుందన్నారు. ఎంపిక సమయంలో మీడియాకు అనుమతి లేదని, డ్రా ముగిసిన తర్వాత మీడియాకు వివరాలు అందజేస్తామన్నారు.