రేపు డయల్ యువర్ డీఎం ప్రోగ్రాం
NRML: నిర్మల్ TGRTC డిపో ఆధ్వర్యంలో బుధవారం డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహించనున్నట్లు డిపో మేనేజర్ కే. పండరి తెలిపారు. ప్రయాణికులు సూచనలు, సలహాలు, బస్సుల సమయాల మార్పు అంశాలపై మాట్లాడాలన్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 9959226003 నంబర్ను సంప్రదించాలని ఆయన కోరారు.