పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
MDK: పెద్ద శంకరంపేట పోలీస్ స్టేషన్లో పోలీస్ అమరవీరుల సంస్కరణ దినోత్సవం, సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఏక్తా దివస్ పురస్కరించుకొని రక్తదాన శిబిరం చేపట్టారు. అల్లాదుర్గం సీఐ రేణుక రెడ్డి రక్తదాన శిబిరం ప్రారంభించగా, పలువురు యువకులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద శంకరంపేట ఎస్సై ప్రవీణ్ రెడ్డి, శంకర్, రాజేష్, పోచయ్య పాల్గొన్నారు.