6న జిల్లా సమీక్షా కమిటీ సమావేశం

VSP: జిల్లా సమీక్షా కమిటీ సమావేశం(డి.ఆర్.సి.) ఈ నెల 6న ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. జిల్లా అధికారులతో మంగళవారం కలెక్షరేట్లో ఆయన సమావేశమయ్యారు. జిల్లా ఇంఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి అధ్యక్షతన కలెక్షరేట్లో జరగనున్నట్లు చెప్పారు. ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతారని పేర్కొన్నారు.