అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్
ATP: ఇంజినీరింగ్ శాఖల అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని రోడ్లు, బ్రిడ్జిలు, విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాల నిర్మాణాలను మార్చి నాటికి పూర్తిచేయాలని సూచించారు. జిల్లా అభివృద్ధికి పనులు సమయానికి పూర్తి చేయడం ముఖ్యమని తెలిపారు.