వికలాంగుల, చేయూత పెన్షన్లు పెంచాలని డిమాండ్

వికలాంగుల, చేయూత పెన్షన్లు పెంచాలని డిమాండ్

BHNG: వికలాంగుల, చేయూత పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ కాచారంలో MRPS ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సభకు MRPS జిల్లా ఇన్‌ఛార్జ్ మహేందర్ మాదిగ నాయకత్వం వహించారు. CM రేవంత్ పింఛన్లు పెంచుతామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చలేదని విమర్శించారు. సెప్టెంబర్ 9న హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే పెన్షన్ దారుల గర్జన మహాసభ విజయవంతం చేయాలని కోరారు.