ఆలయ ఉద్యోగి ఇంట్లో రూ.10 లక్షలు చోరీ
TPT: పెరుమాలపల్లి పంచాయతీ, ఎస్పీ నగర్లో భారీ చోరీ జరిగింది. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో పనిచేస్తున్న డబేదార్ వల్లేటి మురళీమోహన్ ఇంట్లో రాత్రి దొంగలు పడ్డారు. ఇంటి తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. రెండు బీరువాలలో ఉన్న రూ.10 లక్షల నగదు, 320 గ్రాముల బంగారు ఆభరణాలు దోచుకున్నారు. బాధితుని ఫిర్యాదుతో రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.