రాయితీపై 18 టన్నుల జీలుగ విత్తనాలు అందజేత

ఏలూరు: పోలవరం మండలంలో గిరిజన, గిరిజనేతర రైతులకు రాయితీపై అందజేసేందుకు 18 టన్నుల జీలుగ విత్తనాలు రప్పిస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారి కె.రాంబాబు చెప్పారు. రైతు సేవా కేంద్రాల ద్వారా గిరిజనులకు 90శాతం, గిరిజనేతరులకు 50శాతం రాయితీపై విత్తనాలు అందజేస్తామన్నారు. పట్టిసీమ గ్రామానికి చెందిన రైతుకు డ్రోన్ మంజూరైందని త్వరలో అందజేయనున్నట్లు పేర్కొన్నారు.