మద్యం మత్తులో కారు బీభత్సం
VSP: మంగవారి పేట జంక్షన్ వద్ద మద్యం మత్తులో యువకులు కారు అదుపు తప్పించి డివైడర్‌ను ఢీకొట్టారు. హైదరాబాద్‌కు చెందిన 5 మంది అతివేగంతో ప్రయాణిస్తుండగా సీసీ కెమెరా స్తంభాన్ని బలంగా ఢీకొనడంతో కారు నుజ్జునుజ్జైంది. ప్రమాదంలో ముగ్గురికి గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇద్దరు ఘటన స్థలం నుంచి పరారయ్యారు. బీచ్ పెట్రోల్ పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించారు