రాజాపేట చెరువుల్లోకి చుక్కనీరు రాలే

BHNG: గత పది రోజులుగా యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడంతో చెరువులు అలుగులు పోస్తూ, వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. కానీ రాజాపేట మండల వ్యాప్తంగా మోతాదు వర్షపాతం నమోదు కావడంతో చెరువుల్లో ఇప్పటివరకు చుక్క నీరు వచ్చి చేరలేదు. రాజాపేట మండలంలో 10 చెరువులు, 36 కుంటలు ఉన్నాయి. ఈ ప్రాంతంపై వరుణుడు కరుణ చూపాలని రైతులు అంటున్నారు.