'తలసరి ఆదాయం పెంపుపై దృష్టి పెట్టాలి'
కర్నూలు: కలెక్టర్ సిరి అధికారులతో ఇవాళ సమావేశం నిర్వహించి జిల్లాలో తలసరి ఆదాయం పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల్లో మరింత పురోగతి సాధించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించి ప్రభుత్వ శాఖల పనితీరును మెరుగుపరచాలని అధికారులకు తెలిపారు.