నిజామాబాద్ నగరంలో దంచి కొట్టిన వర్షం

NZB: జిల్లా కేంద్రంలో భారీగా వర్షం కురుస్తోంది. గురువారం ఉదయం నుంచి తేలికపాటి వర్షం కురువగా, గురువారం రాత్రి 9 గంటల నుంచి భారీగా వర్షం కురిసింది. దీంతో వర్షపు నీరు రోడ్లపై ప్రవహించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నగరంలోని సుభాష్ నగర్ రైతుబజార్ నుంచి చంద్రశేఖర్ కాలనీ వెళ్లే రోడ్డుపై వర్షపు నీరు చేరింది.