రీల్స్ పిచ్చి.. ప్రమాదకర స్టంట్స్!

రీల్స్ పిచ్చి.. ప్రమాదకర స్టంట్స్!

TG: లైక్స్‌ల కోసం యువత ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ప్రమాదకర స్టంట్స్ చేస్తూ.. ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ యువకుడు రెండు కాళ్లు.. రెండు బైకుల మీద పెట్టి నిలబడి స్టంట్ చేస్తాడు. అయితే కొంచెం తేడా అయినా.. ప్రాణాలకే ప్రమాదం అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.