నేడు శ్రీకాళహస్తీశ్వరాలయంలో అమావాస్య ఉత్సవం
CTR: శ్రీకాళహస్తీశ్వరాలయంలో తై(మౌని) అమావాస్యను పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు అర్చకులు తెలిపారు. సోమస్కందమూర్తి, జ్ఞానాంబిక ఉత్సవమూర్తులను ముక్కంటి ఆలయం నుంచి ఆదివారం ఊరేగింపుగా భరద్వాజతీర్థం వద్దకు తీసుకెళ్లనున్నారు. అక్కడి భరద్వాజేశ్వర ఆలయంలో ఉత్సవమూర్తులకు విశేష పూజలు, ప్రత్యేక అభిషేకాలు నిర్వహించనున్నారు.