బస్సులో మహిళ ప్రసవం.. అభినందించిన సజ్జనార్

HYD: ముషీరాబాద్ డిపోకు చెందిన బస్సులో శ్వేతా రత్నం అనే గర్భిణీ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అయితే విషయాన్ని తెలుసుకున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. డ్రైవర్, కండక్టర్ సరోజతో పాటు మహిళా ప్రయాణికులను అభినందించారు. అప్రమత్తమై సకాలంలో స్పందించడం వల్లే తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని వారిని అభినందించారు.