రేపటి కృష్ణ ఎక్స్‌ప్రెస్ రైలు రద్దు

ADB: భారీ వర్షాల కారణంగా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఇందులో భాగంగా ఈనెల 3న మంగళవారం ఆదిలాబాద్ నుంచి తిరుపతికి రాత్రి 9.05కి బయలుదేరే కృష్ణ ఎక్స్‌ప్రెస్ రైలు (నంబర్ 17206)ను రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని సూచించారు.