కొవ్వూరు రెండు కార్లు ఢీ
E.G: కొవ్వూరులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు కార్లు ధ్వంసం అయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. కొబ్బరి బొండం తాగేందుకు రోడ్డుపై వాహనం ఆపడంతో వెనుక నుంచి వచ్చిన మరో వాహనం ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రెండు కార్లు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం జరగలేదని స్థానికులు తెలిపారు. కాగా ఈ ప్రమాదంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.