డ్రగ్స్ గుట్టురట్టు.. నైజీరియన్ మహిళ అరెస్ట్

డ్రగ్స్ గుట్టురట్టు.. నైజీరియన్ మహిళ అరెస్ట్

TG: సికింద్రాబాద్‌లో డ్రగ్స్ గుట్టురట్టు అయింది. డ్రగ్స్ విక్రయిస్తున్న నైజీరియన్ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. 7.5 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ముంబైలో గ్రాము రూ.15,000కి కొనుగోలు చేసి హైదరాబాద్‌లో రూ.30,000కి అమ్ముతున్నట్లు గుర్తించారు. నిందితురాలిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.