FLASH: రేపే నోటిఫికేషన్ విడుదల
HYD: TG EAPCET 2026 ప్రవేశ పరీక్షకు సంబంధించి శనివారం ఉదయం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు పరీక్షల కన్వీనర్ విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ నెల 19వ తేదీ ఉదయం 11:30 గంటల నుంచి విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చని HYD JNTU నుంచి అధికారులు పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.