పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించిన అధికారి

NLR: కొడవలూరు మండలం, రామన్నపాలెం గ్రామపంచాయతీ పరిధిలో పారిశుద్ధ్య పనులను గురువారం కావలి డివిజన్ అభివృద్ధి అధికారి విజయ్ కుమార్ పర్యవేక్షించారు. తడి చెత్త పొడి చెత్త సేకరణ విధానాన్ని స్వయంగా పరిశీలించారు. అనంతరం పారిశుద్ధ్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యతని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.