సీఎంను కలిసిన నగరి ఎమ్మెల్యే

సీఎంను కలిసిన నగరి ఎమ్మెల్యే

CTR: సీఎం నారా చంద్రబాబు నాయుడును నగరి ఎమ్మెల్యే గాలి బాను ప్రకాష్ గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. అమరావతిలోని సచివాలయంలో ఆయనను ఎమ్మెల్యే కలిశారు. నియోజకవర్గంలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులను తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు విస్తృత ప్రచారం కల్పించాలని సీఎం సూచించినట్టు వెల్లడించారు.