నేడు పరిగిలో బీసీ కుల సంఘాల సమావేశం

నేడు పరిగిలో బీసీ కుల సంఘాల సమావేశం

VKB: పరిగి నియోజకవర్గం బీసీ కుల సంఘాల సమావేశం ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు పట్టణంలోని కోడంగల్ రోడ్డులోని స్వాగత్ హోటల్లో నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర బీసీ జేఏసీ కన్వీనర్ హన్మంత్ ముదిరాజ్ తెలిపారు. ఈ సమావేశంలో నియోజకవర్గ బీసీ జేఏసీ కమిటీని ఎన్నుకోవడం జరుగుతుందని ఆయన చెప్పారు. త్వరలో పరిగిలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కృషి చేయాలన్నారు.