బీజేపీ జిల్లా అధ్యక్షుడిని సన్మానించిన కార్యకర్తలు

HNK: జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో నేడు జిల్లా నూతన అధ్యక్షులు కొలను సంతోష్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ధర్మసాగర్ మండల ప్రధాన కార్యదర్శి కొంగంటి సందీప్ బీజేవైఎం హనుమకొండ జిల్లా అధికార ప్రతినిధి గుండెకారి శివకృష్ణలు మాజీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మతో కలిసి అభినందించారు.