చెరువులో దూకి మహిళ ఆత్మహత్య

BDK: పాల్వంచ పట్టణం టీచర్స్ కాలనీకి చెందిన గోకినపల్లి విజయ గత కొంతకాలంగా భర్తతో విడిగా ఉంటూ తన ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తోంది. కుటుంబ కలహాలతో తీవ్ర మనోవేదనకు గురైంది. దీనితో పాత పాల్వంచ చింతలచెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.