VIDEO: పోలీస్ స్టేషన్‌లో సేఫ్టీ వింగ్ ప్రారంభించిన ఏసీపీ
NTR: మహిళలు, చిన్నారుల రక్షణకు మరింత బలం చేకూర్చే విధంగా తిరువూరు పోలీస్ స్టేషన్‌లో ఉమెన్స్ & చైల్డ్ సేఫ్టీ వింగ్ కార్యాలయాన్ని మైలవరం ఏసీపీ ప్రసాద్ రావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ వింగ్ ద్వారా బాధితులకు త్వరితగతిన సహాయం అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ గిరిబాబు, ఎస్సై శాతకర్ణి, గౌరీశ్వరి సిబ్బంది పాల్గొన్నారు.