మంత్రి పేరిట టీటీడీ నకిలీ లెటర్ల తయారీ
AP: మంత్రి సత్యకుమార్ పేరిట టీటీడీ నకిలీ లెటర్ల తయారీపై విజయవాడ సీపీకి మంత్రి పీఏ ఫిర్యాదు చేశారు. కొద్ది రోజులుగా మంత్రి పేరుతో నకిలీ లెటర్లు ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని సీపీ రాజశేఖర్ బాబు వెల్లడించారు. టీటీడీ ఫేక్ లెటర్లు ఇచ్చే వారి విషయంలో ప్రజలు జాగ్రత్త వహించాలని సీపీ కోరారు.