పోక్సో కేసులో సంచలన తీర్పు

పోక్సో కేసులో సంచలన తీర్పు

TG: రంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టు 9 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడైన ఆటో డ్రైవర్‌కు జీవిత ఖైదు విధించింది. అలాగే, రూ.55 వేల జరిమానా, బాధితురాలికి జడ్జి రూ.5 లక్షలు పరిహారం మంజూరు చేశారు. 2022లో ఆటోడ్రైవర్ సలీమ్ తొమ్మిదేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మూడేళ్ల తర్వాత నేరం రుజువు కావడంతో నిందితుడికి జీవిత ఖైదు పడింది.