రాష్ట్ర స్థాయి విజేతలుగా చిత్తూరు దివ్యాంగులు
CTR: డిసెంబర్ 1, 2 తేదీల్లో గుంటూరులో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డివ్యాంగుల (పారా స్పోర్ట్స్) స్కూల్ బ్యాడ్మింటన్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రస్థాయి విజేతలుగా నిలిచిన చిత్తురు క్రీడాకారులను బుధవారం కలెక్టర్ సుమిత్ కుమార్ తన కార్యాలయానికి పిలిపించి అభినందించారు. మరిన్ని విజయాలను సాధించాలని ఆకాంక్షించారు.