త్వరలో ఐటీ కారిడార్లలో పాడ్ కార్లు..!

HYD: మెట్రో స్టేషన్ నుంచి నేరుగా కార్యాలయాలకు వెళ్లేందుకు ప్రత్యేకంగా అందుబాటులోకి తీసుకురావాలని హైదరాబాద్ మెట్రోరైల్ లిమిటెడ్ సంకల్పించింది. ఈ వ్యవస్థలో భాగంగా పాడ్ కార్ లేదా పాడ్ ట్యాక్సీలను పరిచయం చేసి ప్రత్యేక కారిడార్లలో వాటిని నడిపేందుకు రూ.1,480 కోట్ల అంచనా వ్యయంతో DPRను సిద్ధం చేసినట్లు సమాచారం.