అంగన్వాడీల్లో పిల్లల సంఖ్య పెంచాలి: ఫుడ్ కమిషన్

అంగన్వాడీల్లో పిల్లల సంఖ్య పెంచాలి: ఫుడ్ కమిషన్

KDP: అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆహార కమిషన్ ఛైర్మన్ చిత్తా విజయ ప్రతాపరెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం పులివెందుల పట్టణంలోని బ్రాహ్మణపల్లి రోడ్డు, చౌడమ్మ వెనుక వీధిలోని కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించి, చిన్నారులకు అందుతున్న పోషకాహారంపై ఆరా తీశారు.