నిప్పు అంటించుకుని మహిళ ఆత్మహత్య
KDP: ప్రొద్దుటూరులో ఒంటరి జీవితంపై విరక్తి చెంది షేక్ అబీదా (42) అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. భర్తతో విడిపోయి, కుమారుడు మరణించడంతో మానసికంగా కుంగిపోయిన ఆమె, కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకుంది. స్థానికులు సమాచారం అందించేలోపే ఆమె మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.