'ప్రభుత్వ సాయన్ని సద్వినియోగం చేసుకోవాలి'
SRPT: సీఎం సహాయనిధి ద్వారా ప్రైవేట్ వైద్యం పొందిన పేదలకు అందించే సాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. ఇవ్వాళ జిల్లా కేంద్రంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ వ్యాప్తంగా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మంజూరైన 80 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేసి మాట్లాడారు.