VIDEO: హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్.. చుక్కలు చూస్తున్న వాహనదారులు

VIDEO: హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్.. చుక్కలు చూస్తున్న వాహనదారులు

NLG: HYD-VJA జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద సాంకేతిక లోపంతో ఓ లారీ నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో పెద్దకాపర్తి నుండి గుండ్రాంపల్లి వరకు సుమారు 10 కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. వారాంతం కావడంతో HYDకి వెళ్లే వాహనాల రద్దీ కూడా కారణమైంది.