'వెంకట శివయ్య స్తూపం చుట్టూ గార్డెన్ ఏర్పాటు చేయాలి'
PLD: వినుకొండ పట్టణంలో ఉన్న పులుపుల వెంకట శివయ్య స్తూపం చుట్టూ ఉన్న ఆక్రమణలను తొలగించి, ఆ ప్రదేశాన్ని శుభ్రపరిచి అందమైన గార్డెన్‌గా అభివృద్ధి చేయాలని CPI పట్టణ సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు CPI పట్టణ సమితి నాయకులు వినుకొండ మున్సిపల్ కమిషనర్‌ను కలిసి బుధవారం వినతి పత్రం అందజేశారు.